తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో జూన్ 5వ తేదీన ప్రారంభమైన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12న ముగిశాయి. మొత్తం 31,542 మంది పరీక్ష ఫీజు చెల్లించగా.. వారిలో 17,768 మంది (56.33%) హాజరయ్యారు.