స్టైపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ఉద్యోగాల భర్తీలో హోంగార్డులకు 10% రిజర్వేషన్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గత జీవోల్లో మార్పులు చేసింది. కాగా పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో 198 స్టైపెండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు ఈ నెలలో నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే.