కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల వెరిఫైడ్ స్కోర్ల వెల్లడి
సమగ్ర శిక్ష, నంద్యాల పరిధిలోని KGBVలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయ నియామకాల కోసం 20.08.2026న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల వెరిఫైడ్ స్కోర్లు (వెయిటేజ్ మార్కులు) విడుదల చేయబడ్డాయి.
అభ్యర్థులు తమ స్కోర్లను నంద్యాల సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయంలో లేదా అధికారిక బ్లాగ్‌లలో (https://samagrashikshanandyal.blogspot.com, https://deonandyal.blogspot.com) పరిశీలించుకోవచ్చు.
వెరిఫైడ్ స్కోర్లపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సమర్పించడానికి సమయం కేటాయించారు.అభ్యంతరాలను 23.09.2026 (బుధవారం) నుండి 26.09.2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటల లోపు సమగ్ర శిక్ష, నంద్యాల కార్యాలయంలో అందజేయాలి.
నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు స్వీకరించబడవు.
0 Comments