ALL INDIA TEACHERS PORTAL
BREAKING NEWS
Teacher recruitment notifications, GOs, transfers and latest education updates from across India

TG Schools Bundh: నేడు పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

 


రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఏబీవీపీ (ABVP) మంగళవారం (నేడు) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి. జీవన్ తెలిపిన వివరాల ప్రకారం 'రేషనలైజేషన్' (Rationalization) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ బంద్ చేపట్టారు.ఈ బంద్‌ను విజయవంతం చేయడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యావేత్తలు తమకు సహకరించాలని ఏబీవీపీ కోరింది.

నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత విద్యను దూరం చేసేందుకే ప్రభుత్వం కంకణం కట్టుకుందని జీవన్ ఆరోపించారు. బడుల మూసివేత నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని స్పష్టం  చేశారు.కేవలం ఒకే పర్మిషన్ (అనుమతి) తీసుకుని, దానికి విరుద్ధంగా పలు బ్రాంచీలను నడుపుతున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share this article

Post a Comment

0 Comments