తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్ట్రిక్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. ఐఐటీ, జేఈఈ, నీట్, సీఎంఏ, క్లాట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోర్సుల అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన బోధనా సిబ్బందిని దరఖాస్తుల కోసం ఆహ్వానిస్తున్నట్టు తెలి పింది. మొత్తం 117 పోస్టుల్లో ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సీఈవో పోస్టులు 50, డిస్ట్రిక్ట్ సీఈవో పోస్టులు 67 ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నది. ఈ నెల 30 లోపు సరూర్ నగర్ లోని ప్రధాన కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. వివరాలకు వెబ్ సైట్ లేదా 040 2300 5100 నంబర్ లో సంప్రదించాలని పేర్కొన్నది.

0 Comments