TG: బడుల మూసివేత నిర్ణయం సరి కాదు: సీఎంకు విద్యావేత్తలు, మేధావుల బహిరంగ లేఖ
WhatsApp Channel Join Now

Thursday, June 25, 2026

TG: బడుల మూసివేత నిర్ణయం సరి కాదు: సీఎంకు విద్యావేత్తలు, మేధావుల బహిరంగ లేఖ

 తెలంగాణా లోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసి, మిగిలిన 23 వేల పాఠశాలలను మూసివేయాలన్న ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యావేత్తలు, మేధావులు, పౌరసమాజ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి కి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ నిర్ణయం అమలైతే గ్రామీణ ప్రాంతాలు, దళిత, ఆదివాసీ, పేద వర్గాల పిల్లల విద్యకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'జయశంకర్ బడిబాట' కార్యక్రమం మొక్కుబడిగా మారడం వల్లే చేరికలు తగ్గి, 'జీరో ఎన్ రోల్ మెంట్ బడులు పుట్టుకొస్తున్నాయని విమర్శిం చారు. దానికి తోడు రాష్ట్రంలోని 25 జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు లేరని 612 మండలాల్లో ఎంఈవోలు లేరని వెల్లడించారు. విద్యా ప్రమాణా లను తెలిపే 'పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్' ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ అత్యంత వెనుకబడి ఉందన్నారు. ఇకనైన ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన, ఖాళీల భర్తీపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాలల మూసివేతకు బదులుగా వాటిని బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.