2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ క్రీడల అకాడమీలు, ప్రాంతీయ క్రీడా వసతి గృహాల్లో ప్రవేశాలకు ఎంపికలు ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా యువజన సర్వీసుల శాఖ ఇన్‌ఛార్జి అధికారి జి.రేణుకాదేవి తెలిపారు. 20న సైక్లింగ్, రెజ్లింగ్(బాలురు) క్రీడలకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎంపిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 21న అథ్లెటిక్స్(బాలురు) ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీ, 20, 21న వాలీబాల్(బాల-బాలికలు) సరూర్‌నగర్ వాలీబాల్ అకాడమీలో, 22, 23వ తేదీల్లో వాలీబాల్(బాల, బాలికలు) సిద్దిపేటలోని వాలీబాల్ అకాడమీలో, వాలీబాల్(బాలురు) రాజన్న-సిరిసిల్లలోని వాలీబాల్ అకాడమీలో, 25, 26వ తేదీల్లో కబడ్డీ(బాలురు) మహబూబ్‌నగర్ కబడ్డీ అకాడమీలో, వాలీబాల్(బాల-బాలికలు) మహబూబ్నగర్ వాలీబాల్ అకాడమీలో, 27, 28న ప్రాంతీయ క్రీడా వసతి గృహం హనుమకొండలో జిమ్నాస్టిక్స్ (బాల-బాలికలు), స్విమ్మింగ్ (బాలురు), అథ్లెటిక్స్ క్రీడలకు(బాల-బాలికల) ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రేణుకాదేవి పేర్కొన్నారు. బోనఫైడ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, 10పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు.